📌=> ఆర్యుల యుగాన్ని (1500-600 బి.సి.) రెండు యుగాలుగా వర్గీకరించారు.
1) తొలి వేదకాలం (1500-1000 బి.సి.)
2) మలి వేదకాలం (1000-600 బి.సి.)
=> తొలి వేదకాలంలో యుద్దాలు ప్రధానంగా గోవులు, గడ్డి భూముల కొరకై జరిగేవి. దీనిని 'గవిస్తి' అంటారు. తొలి వేదకాలంలో అతిపెద్ద యుద్ధం -దశరాజగణ యుద్ధం. ఇది సుమారు క్రీ.పూ.1000 సంవత్సరములో పరూషిణి(రావి నది) నది ఒడ్డున భరత వంశానికి చెందిన సుధాముడు, పురు వంశానికి చెందిన పురుకుత్స మధ్య జరిగింది. ఈ యుద్ధం తర్వాత భరత, పురు వంశం మధ్య వివాహ సంబంధాలు ఏర్పడ్డాయి. ఫలితంగా కురు తెగ ఆవిర్భవించింది. తర్వాత కురు తెగ రెండుగా చీలిపోయింది.
1) పాండవులు
2) కౌరవులు
పాండవులు, కౌరవులు మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగింది.
=> మలి వేదకాలంలో రాజ్యాల విస్తరణ కొరకు యుద్దాలు జరిగేవి. వీటిని మహా సంగ్రామాలు అంటారు. అందువల్లనే క్రీ.పూ. 6వ శతాబ్ధంలో చిన్న చిన్న రాజ్యాలు అంతమై 16 మహా రాజ్యాలు లేదా మహాజనపదాలు ఆవిర్భవించాయి.
=> తొలి వేదకాల సమాజంలో సమానత్వం ఉండేది. యజ్ఞయాగాదులు, కర్మకాండలు, అంటరానితనం మొదలగునవి ఉండేవికావు. స్రీలకు స్వేచ్చ కల్పించబడినది. బాల్య వివాహాలు ఉండేవి కావు. మైత్రేయి, గార్గీ, ఉలేపి, వాకానవి, గౌతమి, రిషనార
మొదలగు మహిళలు బుషి హోదాను పొందారు. భూఅధిపతిని ప్రజాపతి అనేవారు. కుటుంబపెద్ద -కులపతి. అనేక కుటుంబాలకు పెద్ద -జెస్టా. కుల వ్యవస్థ ఏర్పడలేదు. అనగా పుట్టుకతో వర్ణ వ్యవస్థ అనేది లేదు.
=> మలి వేదకాలంలో యజ్ఞయాగాదులు, కర్మకాండలు, అంటరానితనం మొదలగునవి ప్రవేశపెట్టబడ్డాయి. స్రీలు తమ స్వేచ్చను కోల్పోయారు. వర్ణ వ్యవస్థ పుట్టుక ఆధారంగా ప్రవేశపెట్టబడినది. బుగ్వేదంలోని 10వ మండలంలో 'పురుషసూక్త'లో వర్ణ వ్యవస్థ గురించి పేర్కొనబడింది. మలి వేదకాలంలో కుల వ్యవస్థ పటిష్టమైనది.
=> అనులోమ వివాహం: అగ్ర వర్షానికి చెందిన పురుషుడు నిమ్న కులానికి చెందిన మహిళను వివాహం చేసుకోవచ్చు.దీనిని అంగీకరించేవారు.
=> ప్రతిలోమ వివాహం: అగ్ర వర్ణానికి చెందిన మహిళ నిమ్న వర్ణానికి చెందిన పురుషుని వివాహమాడుట. దీనిని అంగీకరించేవారు కాదు.
=> బ్రాహ్మణ పురుషుడు, శూద్ర మహిళకు జన్మించినవారిని నిషాద అంటారు. బ్రాహ్మణ మహిళ, శూద్ర పురుషునికి జన్మించినవారిని చండాల అంటారు.
=> తొలి వేదకాలంలో ఆర్యుల ముఖ్య వృత్తి పశుపోషణ. గోవులను మాత్రమే ఆస్తులుగా భావించేవారు. గోవుల అధిపతిని “గోపతి” అనేవారు. తొలి ఆర్యులకు రాగి, కంచు లోహాలు తెలుసు. మలి వేదకాలంలో ఆర్యుల ప్రధాన వృత్తి -వ్యవసాయం. ద్వితీయ వృత్తి -వర్తకం. మలి వేదకాలంలోనే ఇనుము కనుగొనబడినది. ఇనుము సహాయంతో అడవులను నరికి వాటిని వ్యవసాయ భూములుగా మార్చారు. ఇనుప నాగలిని, కొడవలిని ఉపయోగించారు. దీని కారణంగా వ్యవసాయ దిగుబడి అత్యధికమైనది. ఇది వర్తకానికి దారితీసింది. మలి వేదకాలంలోనే నిష్కా సతమాన, కర్షాపణ అనే వెండి నాణెములు ప్రవేశపెట్టబడ్డాయి.
=> తొలి వేదకాలంలో ఆర్య సమాజాన్ని పాలించేవాడిని “రాజన్” అనేవారు. విధాత: ఇది ఒక మహిళా మండలి. మహిళల సమస్యలకు సంబంధించి సలహాలు ఇచ్చేది. మలి వేదకాలంలో రాజు ఒక నియంతగా మారాడు.
=> తొలి వేదకాలంలో ఆర్యుల ముఖ్యమైన దేవుళ్లు ఇంద్రుడు (ఆర్యుల యుద్ధ వీరుడు), అగ్ని (అతి భయంకరమైన దేవుడుగా పరిగణించేవారు), వరుణుడు (నైతిక విలువలకు దేవుడు). మలి వేదకాలంలో ఆర్యుల ముఖ్యమైన దేవుళ్లు
బ్రహ్మ: సృష్టికర్త, విష్ణు: సృష్టి రక్షణకర్త, శివుడు : సృష్టి నాశనకర్త (లయకర్త).
=> వేదాలు మానవునిచే రచించబడలేదు. మొత్తం 4 వేదాలు (బుగ్వేదము, సామ వేదము, యజుర్వేదము, అధర్వణ వేదము) ఉన్నాయి. వేదాలు తపో మార్గాన్ని పేర్కొన్నాయి (మోక్షం సాధించడానికి). మొదటి 3 వేదాలు ఆర్యులకి చెందినవి. వీటిని “త్రయి” అంటారు.
=> బుగ్వేదము: అతి పురాతనమైనది. ఇందులో 10 మండలాలు, 1028 సూక్తులు/ శ్లోకాలున్నాయి. దశరాజ గణయుద్ధం గూర్చి పేర్కొంది. 3వ మండలంలో గాయత్రీ మంత్రం (సావిత్రిదేవికి సంబంధించినది) పేర్కొనబడింది.10వ మండలంలో విశ్వ జననం, వర్ణ వ్యవస్థ గురించి పేర్కోనబడింది. మంత్రాలు పఠించేవారిని హోత్రి అంటారు.
=> సామ వేదము: సంగీతం గురించి తెలియజేస్తుంది. ఇది భారతదేశంలో సంగీతంపై మొదటి పుస్తకం. మంత్రాలు పఠించేవారిని ఉద్గటర్ అంటారు.
=> యజుర్వేదము: యజ్ఞయాగాదుల గూర్చి పేర్కొంటుంది. మంత్రాలు పఠించేవారిని అధర్వాయ అంటారు.
=> అధర్వణ వేదము: వైద్యం, మంత్ర తంత్రాల గురించి తెలియజేస్తుంది
ఇది ఆర్యేతరులు రచించిన వేదము. మంత్రాలు పఠించేవారిని బ్రాహ్మణ అంటారు.
=> ఉపనిషత్తులు: మొత్తం 108 ఉపనిషత్తులు ఉన్నాయి. గురువు పాదాల వద్ద కూర్చుని జ్ఞానాన్ని పొందడాన్ని ఉవనిషత్తు అంటారు. ముండక ఉవనిషత్తులో “సత్యమేవ జయతే” అనే పదాలున్నాయి.
ఉపనిషత్తులు జ్ఞాన (మోక్ష)
మార్గాన్ని పేర్కొన్నాయి.
=> బ్రాహ్మణాలు: పద్య రూపంలో ఉన్న వేదాలను గద్య రూపంలో విశ్లేషిస్తాయి. యజుర్వేదము గురించి శతపథ బ్రాహ్మణంలో పేర్కొనబడినవి.
=> ఉపవేదాలు: ఇవి వేదాలపై వ్యాఖ్యలు చేస్తాయి. అవి
1) ఆయుర్వేదం (అధర్వణవేదం)
2) ధనుర్వేదం (యుద్ధ కళలు) (బుగ్వేదం)
3) గాంధర్వవేదం (సంగీతము)
(సామవేదం)
4) శిల్పవేద (కళలు) (యజుర్వేదం)
=> వేదాంగాలు: వేదాలను అర్ధం చేసుకోవడానికి వీటిని తప్పనిసరిగా చదవాలి.
1. కల్ప - విధులు, బాధ్యతలు, యజ్ఞాలు నిర్వహించే తీరు
2. శిక్ష - సరైన ఉచ్భారణ
3. చంధస్సు - శబ్ధం
4. నిరుక్త - కష్టమైన పదాల అర్థం
5. వ్యాకరణ - వ్యాకరణం
6. జ్యోతిష్య - నక్షత్రశాస్త్రం
=> పురాణాలు:
మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. ఇవి గుప్తుల కాలంలో రచించబడ్డాయి.
=> ఇతిహాసాలు:
1. రామాయణం: రాముడికి సంబంధించిన చరిత్ర. వాల్మీకి రచించాడు.
2. మహాభారతం: శ్రీకృష్ణుడు, పాండవులకు, కౌరవులకు సంబంధించిన చరిత్ర. వేదవ్యాసుడు రచించాడు.
=> మహాభారతాన్ని జయసంహిత/శతసంహిత అని కూడా అంటారు. మహాభారతాన్ని భారతదేశంలో పంచమవేదం అంటారు.
=> రామాయణం, మహాభారతములు రెండవ చంద్రగుప్తుని కాలంలో లిఖించబడ్డాయి.
=> క్రీ. పూ.5వ శతాబ్ధంలో పాణిని “అష్టాధ్యాయి’’' అనే గ్రంథాన్ని రచించాడు. ఇది సంస్కృతాన్ని ఎలా వ్రాయాలి మరియు మాట్లాడాలి అనేదానికి ప్రమాణాన్ని నిర్దేశించే భాషాశాస్త్ర గ్రంథం. దీన్ని భగవతి సూత్ర అని కూడా అంటారు. భరతుడు నాట్యశాస్త్రాన్ని సంస్కృతంలో రచించాడు. ఇది సంస్కృత తొలి గ్రంథాల్లో ఒకటి.
No comments:
Post a Comment