మే దినోత్సవం


మే దినోత్సవం లేదా మే డే (May Day) ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. ప్రజా శెలవుదినం. చాలా దేశాలలో మే దినం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవంతో ఏకీభవిస్తాయి. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం, కార్మికుల ఐక్యతను గుర్తిస్తాయి.
మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలో వున్న కొంతమంది రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో వుండే కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు.

ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేమూ మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయి. ఈ చాకిరీ మేం చేయలేమని పని ముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడటం, చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం. 24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి (రెస్టు), ఇంకా ఎనిమిది గంటలు రిక్రీయేషన్‌ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత కలిగిన మార్పు.



యాంత్రికయుగం చేసేవాడు. అదొక బానిస బతుకు. మనిషి తన విజ్ఞాన పరిశోధనల మూలంగా యంత్రాలను సృష్టించుకున్నాడు. యాంత్రిక యుగంలో క్యాపిటలిజం ఏవిధంగా పెరిగిందో అదే స్థాయిలో సామాజిక స్పృహ, చైతన్యం కూడా పెరిగాయి. అందువల్లనే పనిగంటల పోరాటం వచ్చింది. కానీ భారతదేశంలో చికాగో కంటే ముందే, కలకత్తాలో కార్మికులు నిర్ణీత పనిగంటల కోసం హౌరా రైల్వేస్టేషన్‌లో 1862లో సమ్మెచేశారు.

1923లో మొదటిసారి భారతదేశంలో ‘మే డే’ను పాటించడం జరిగింది. 1920లో ట్రేడ్‌ యూనియన్‌ ఏర్పడటం మూలంగా అప్పటినుంచే కార్మికవర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటినుండి ‘మే డే’ను పాటించడం జరుగుతుంది. కానీ అసంఘటిత కార్మికవర్గం అన్ని రంగాల్లో వచ్చింది. 1985 తర్వాత చోటుచేసుకున్న ప్రైవేటైజేషన్‌, లిబరలైజేషన్‌, గ్లోబలైజేషన్‌ పరిణామాల వల్ల అసంఘటిత కార్మికవర్గాల కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడంలేదు.
మొదటగా ఈ ఉద్యమం అమెరికాలోని ఫిలడెల్ఫియాలో పని గంటల తగ్గింపు‌ కోసం ప్రారంభమైంది. ఈ ఉద్యమాన్ని కార్మికులు ఉదృతం చేసి పరిశ్రమలను స్తంభింపచేసి కార్మిక ప్రభంజనాన్ని అదుపు చేయలేక 1837 లో రోజుకు 10 గంట‌ల‌ పనిదినాన్ని అమెరికా ప్రభుత్వం శాసనబద్దం చేసింది.
ప్రపంచ శాంతిని అసలు ఈ భూగోళాన్నే కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకు కార్మిక శ్రేణులు ఏకం కావాల్సిన చారిత్రక సందర్భం కూడా ఇదే.
       ఎనిమిది గంటల పని, ఎనిమిది గంటలు వినోదం, ఎనిమిది గంటలు విశ్రాంతి కావాలన్న బ్యానర్ పట్టుకుని 1858లో ఆస్ట్రేలియాలో ఎనిమిది గంటల పని దినోత్సవ మూడో వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న కార్మిక సంఘం అధ్యక్షుడు ఆర్ మిల్లర్, కార్యదర్శి జి. రావెన్‌స్క్రాఫ్ట్, సభ్యులు

మే 1.. అంటే ‘మేడే’. దీన్ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తారు. అమెరికాలో మాత్రం ప్రస్తుతం దీన్ని ‘లాయల్టీ డే’గా వ్యవహరిస్తున్నారు.

చాలా దేశాల్లో మే డేని సెలవు దినంగా పాటిస్తారు. ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో, సంఘటనకో ముడిపెట్టలేం. కానీ 1886లో షికాగోలోని హే మార్కెట్‌లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు పునాది వేసిందని చెబుతారు.
శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదని మహాకవి శ్రీశ్రీ అన్నాడు. మన సమాజ గతిని... పురోగతిని శాసించేది.. నిర్దేశించేది శ్రామిక వర్గం. ఆ శ్రమే వెట్టిచాకిరికి గురైనప్పుడు ఏమౌతుంది. శ్రామికుడు దోపిడీకి గురైనప్పుడు ఏం జరుగుతుంది. కష్టించి పని చేసే చేతులు పిడికిళ్లు బిగిస్తాయి.. భూకంపాలను తీసుకొస్తాయి..ఉద్యమాలు పుట్టుకొస్తాయి
మే డే నేడే.. కార్మిక దండుకు శత కోటి వందనాలు..
ప్రపంచం ముందుకు నడవాలంటే కార్మికుడు కావాలి. అతడు తన రక్త మాంసాలు కరిగించి, చెమట చిందించి పనిచేస్తేనే మనం ముందుకు సాగేది. వారి శ్రమను గుర్తిస్తూ జరుపుకుంటున్నదే ‘మే డే’ ఈ రోజు వారి ఐక్యత, పోరాటానికి నిదర్శనం.

No comments:

Post a Comment